
వలిగొండ, క్రైమ్ మిర్రర్ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలో అక్రమ మద్యం విక్రయంపై పోలీసులు దాడులు నిర్వహించారు. వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామంకు చెందిన పంతంగి వెంకటేష్ నిర్వహిస్తున్న కిరాణా షాపులో, హెచ్‌సి 1907, హెచ్‌జి 716 సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో నిందితుడు ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా ఐఎంఎఫ్ఎల్ మద్యం సీసాలను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రూ. 61,473 విలువైన 81.675 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read More : హైకోర్టు తీర్పు: చలానాల పేరుతో వాహనదారులను ఆపి బలవంతం చెయ్యొద్దు
ఈ ఘటనపై క్రైమ్ నెంబర్ 17/2026 కింద తెలంగాణ ఎక్సైజ్ చట్టం ప్రకారం సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ఎస్సై యుగంధర్ గౌడ్ తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.