క్రైమ్తెలంగాణ

ఐలా అధికారుల సహకారం తోనే అక్రమ నిర్మాణాలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:-రాజేంద్ర‌న‌గ‌ర్ స‌ర్కిల్ ప‌రిధిలో అక్ర‌మ నిర్మాణాల‌ను అడ్డుకునే నాధుడు క‌రువ‌య్యాడు. స్థానికంగా అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతున్నా ప‌ట్టించుకోవ‌డంలో అల‌స‌త్వం వహిస్తున్నారు. ఇదేమ‌ని అడిగితే దాడులు, ప్ర‌తిదాడులు, ప్ర‌శ్న‌లు, భ‌యాందోళ‌న‌లు వంటి స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్నారు. ఈ విష‌యంపై స్థానిక ప్ర‌జ‌లు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా వాటిని అడ్డుకోవ‌డంలో వైఫ‌ల్యం చెందుతున్నారు. ప్ర‌ధానంగా మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధి కాటేదాన్ ఇండ‌స్ట్రీయల్ ఏరియాలో విచ్చల విడిగా అక్రమ భారీ భవనాలు, షెడ్లు వెలుస్తున్నాయి. ఈ నిర్మాణాలకు అంతా ఐలా కార్యాలయంలో పనిచేసే కొందరు కిందిస్థాయి సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలిపి ముందుకు సాగుతున్న‌ట్లు స‌మాచారం. వివరాల్లోకి వెళితే కాటేదాన్ ఏరియాలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయినా అవేమి పట్టించుకోకుండా కొందరు ఐలా సిబ్బంది అక్రమార్కులతో కుమ్మకై అందినకాడికి దండుకుంటూ వారికి కావలసిన సహాయ సహయ‌కారాలను అందిస్తూ నిర్మాణాలు పూర్తయ్యే వరకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులను వివరణ కోరగా నోటీసులు జారీ చేశామ‌ని చెప్పి త‌ప్పించుకుంటున్నారు. అయితే ఈ విష‌యంపై ప్ర‌శ్నించేందుకు ప్ర‌య‌త్నిస్తే త‌ప్పించుకుంటున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అదికారులు మౌనంగా ఉన్నంత వ‌ర‌కు ఇలాగే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి అక్ర‌మ నిర్మాణాల‌పై ఉక్కు పాదం మోపాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

అడ్డ‌గోలుగా నిర్మాణాలు..!:-

న‌గ‌ర శివారు రాజేంద్ర‌న‌గ‌ర్ స‌ర్కిల్ ప‌రిధిలో అక్ర‌మ నిర్మాణాల‌ను అడ్డుకునే వారు క‌రువ‌య్యారు. ఇదేమ‌ని అడిగితే దాడులు సైతం చేయ‌డానికి వెనక‌డుగు వేయ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఎన్ని అక్ర‌మ‌ణ‌లు, నిర్మాణాలు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స్థానికులు తెలుపుతున్నారు. దీనికి తోడు అడ్డుకోవాల్సిన అధికారులు సైతం చూసి చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌జ‌లు తెలుపుతున్నారు. ఇప్ప‌టికైనా అధికారులు చొర‌వ చూపి ఆక్ర‌మ‌ణ‌ల‌ను అడ్డుకోవాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Read also: సొంత పార్టీ కార్యకర్తకు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Read also ఈ జిల్లాలకు హెచ్చరిక!.. రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button