
మర్రిగూడ (క్రైమ్ మిర్రర్): మండలంలోని యరుగండ్లపల్లి గ్రామపంచాయతీలో ప్రభుత్వ భూమిపై అక్రమ ఇంటి నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. సర్వే నెంబర్ 533లో 336 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో నారాయణ అనే వ్యక్తి అనుమతులు లేకుండా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ నిర్మాణంపై గతంలో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా, అప్పటి తహసీల్దార్ సంఘమిత్ర నిర్మాణాన్ని తక్షణమే తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. వాటి ప్రకారం అధికారులు నిర్మాణాన్ని నిలిపివేసి, సంబంధిత వారిని హెచ్చరించారు. కానీ వాటిని పట్టించుకోకుండా నారాయణ ఇప్పుడు మళ్లీ ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు.
ఆన్లైన్‌లో ఇంటి నెంబర్ నమోదు – అధికారులు నిర్లక్ష్యమేనా?
అనుమతులు, ధ్రువపత్రాలు లేకుండానే ఈ ఇంటి నిర్మాణం జరుగుతుండడమే కాదు, ఆన్లైన్‌లో ఇంటి నెంబర్ 6-37Aగా నమోదై ఉండటం ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీ సెక్రటరీ ప్రోత్సాహంతోనే ఈ అక్రమం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలతో ఆన్లైన్‌లో నమోదు చేయడం, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ అంశాన్ని సిద్దగోని వెంకటేష్ జిల్లా ఆర్డివో చండూర్‌కు ఫిర్యాదు చేశారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఇంటిని నమోదు చేసిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని, సంబంధిత అధికారులపై, నారాయణపై చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థానికుల డిమాండ్: కఠిన చర్యలు తీసుకోండి
అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునే వారిని ప్రోత్సహించడం సరికాదని స్థానికులు మండిపడుతున్నారు. బాధ్యత గల సెక్రటరీపై విచారణ జరిపి, ఇలాంటి తప్పిదాలు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అక్రమ నిర్మాణాలపై అధికారులు వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థాయి నుంచి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read News
-
కన్న కొడుకు చేతిలో వృద్ధ తల్లిదండ్రుల కన్నీటి గాధ.!
-
తెలంగాణలో స్థానిక ఎన్నికలు రెండు దశల్లో నిర్వహణకు ప్రతిపాదన
-
ఏసీబీ వలలో చిక్కినట్టే చిక్కి.. పరారైన పంచాయతీ కార్యదర్శి!
-
యువకుడి ప్రాణం ఖరీదు మూడు లక్షలు.. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన అమాయకుడు!
-
కొండాపూర్‌లో డ్రగ్స్‌తో రేవ్ పార్టీ భగ్నం.. 11 మంది అరెస్ట్