
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- గుంటూరు జిల్లా చిలువూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కట్టుకున్న భర్తను భార్య అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి శివనాగరాజుకు, లక్ష్మీమాధురితో 2007లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విజయవాడలో పనిచేసే సమయంలో మాధురికి గోపి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడినట్లు దర్యాప్తులో తేలింది. భర్త అడ్డు తొలగించుకోవాలని పక్కా పథకం వేసిన మాధురి, సహకారంతో శివనాగరాజును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కేసు మలుపు తిరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలువూరులో కలకలం రేపింది.
Read also :Terror Attack Threat: గణతంత్ర వేడుకలపై ఉగ్రవాదుల గురి, తెలంగాణలోనూ హై అలర్ట్!
Read also : యాదాద్రిలో అక్రమ మద్యం పట్టివేత.!





