ప్రకాశం జిల్లాలో త్రిబుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లల చెరువు మండలం పెద్ద పిఆర్సి తండాకు చెందిన త్రిబుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. శ్రీకాకుళంలో త్రిబుల్ ఐటీ సీటు సంపాదించిన ప్రవీణ్ నాయక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అన్న వార్త వినగానే ప్రవీణ్ నాయక్ తల్లిదండ్రుల కంటతడి ఆగలేదు.
ఢిల్లీలోని స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు?
త్రిబుల్ ఐటీ విద్యార్థి రామావత్ ప్రవీణ్ నాయక్ చనిపోయాడని తెలియగానే ఎర్రగొండపాలెం నియోజకవర్గ స్థానిక టిడిపి ఇన్చార్జి గూడూరు ఎరిక్సన్ బాబు ప్రవీణ్ నాయక్ భౌతికాయానికి శనివారం నివాళులు అర్పించారు. విద్యార్థి చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటు అని చెప్పుకోచ్చారు. ఇక వెంటనే ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు త్రిబుల్ ఐటీ విద్యార్థి ప్రవీణ్ నాయక్ కుటుంబాన్ని ఓదార్చడంతోపాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎరిక్షన్ బాబు తెలిపారు. ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా మీకు సహాయం అందజేస్తామని తెలిపారు.
పరారీలో మోహన్ బాబు!…వార్తలలో నిజమెంత?
టాప్ హీరో బెడ్ రూంలోకి వెళ్లి అరెస్ట్ చేస్తారా.. రేవంత్‌పై బీజేపీ నేతల ఫైర్