
క్రైమ్ మిర్రర్,సూర్యాపేట జిల్లా:-
సూర్యాపేట మల్టీ జోన్ – II ఇన్చార్జి ఐజిపి తఫ్సీర్ ఇక్బాల్ ఐపిఎస్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. గౌరవ వందనంతో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఆ తరువాత జిల్లా డీఎస్పీలు మరియు సీఐ లతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా భౌగోళిక పరిస్థితులు, జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ప్రాంతాలు, ప్రముఖ వృత్తులు, జిల్లా రాజకీయాల గురించి అలాగే జనాభా గురించి, అలాగే సంవత్సరంలో జరిగిన నేరాలు, నేరాల నివారణ గురించి పోలీసులను ఆరా తీశారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్పై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
కామెంట్స్:-
1.సూర్యాపేట పోలీస్ ముందస్తు ప్రణాళికతో పనిచేస్తున్నారు.
2.పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం మంచి ఆలోచన.
3.ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలి.
4.రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా నిర్విస్తాం.
5.బాగా పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలి, పోలీసు శాఖ కు మంచి పేరు తేవాలి.
6.పిల్లల అక్రమ రవాణా, మహిళా వేదింపులు, ర్యాగింగ్ నిరోధించాలి.
7.అక్రమ కార్యకలాపాలు, గంజాయి సరఫరా సమూలంగా నిర్మూలించాలి.
జగన్ కు “జనమే” వరం… ఎక్కడ అడుగుపెట్టిన జనాలే : అంబటి రాంబాబు.
వైసీపీ దుష్ప్రచారాల పై వెంటనే స్పందించాలి.. మంత్రులను హెచ్చరించిన ఆంధ్ర సీఎం!