
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని ఒక యువకుడి సెల్ఫీ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అతను ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి.. నాశనమైపోతారు అయిపోతారు అంటూ చెప్పవచ్చాడు. నేను ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ఓటు వేశా.. అయినా కానీ న్యాయం జరగలేదంటూ వాపోయాడు. ఇక అసలు వివరాల్లోకి వెళితే… చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం రామాపురానికి చెందిన దినేష్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఒక ప్రభుత్వ బండిని ఢీకొట్టారు. ఆ తరువాత అతని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి నానా తిప్పలు పెట్టారు అని… తన పసి బిడ్డను చేతిలో పెట్టుకుని దినేష్ సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో కొంతమంది కూటమి నాయకులు కావాలనే నన్ను నిర్బంధించి… అక్రమంగా నిర్బంధించి వేధించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నాయకులైనటువంటి యువరాజులు నాయుడు, దొరబాబు చౌదరి అలాగే గణపతి నాయుడు వల్లే మా ప్రాణాలు పోతాయని చెప్పుకొచ్చాడు. వీళ్ళందరూ నన్ను పోలీస్ స్టేషన్ లో చాలా చిత్రహింసలు పెట్టారని… అవన్నీ మీకు తెలియవు. నేను కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేశా… కానీ న్యాయం జరగలేదంటూ తెలిపాడు. ఎవరు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయొద్దని.. వేస్తే నాశనం అయిపోతారని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. దీంతో క్షణాల్లోని ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరు దీని గురించే చర్చిస్తున్నారు.
Read also : వివేక కేసు తరహాలో.. జగన్ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం : సీఎం
Read also : పల్లె పిల్ల కాదు… పులి పిల్ల..! అదరగొట్టిన భవ్య తేజిని బాక్సింగ్ ప్రతిభ