
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా బద్ధకం చాలా ఎక్కువ అయింది. చిన్న పని చేయాలన్నా కూడా చేయలేని మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. ఇక సిటీలో పుట్టిన పిల్లలు… ఏదైనా చిన్న పని చేయమన్నా కూడా చేయలేని పరిస్థితి. ఇంకొంతమంది ఎంత కష్టపడ్డా కూడా ఎక్కువ సంపాదనను రాబెట్టలేక పోతారు. అయినా ప్రస్తుత రోజుల్లో జాబ్ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. అయితే అలాంటి కొంతమంది బద్ధకస్తులకు కూడా లక్షల జీతాలు ఉన్నాయంటే నమ్ముతారా?.. అవును మీరు విన్నది నిజమే!. కేవలం కుక్కలను వాకింగ్కు తీసుకెళ్లడం వల్ల నెలకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు జీతం ఇస్తున్నారు. మరి ఈ కుక్కల వాకింగ్ ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
మన దేశంలోని మహారాష్ట్రలో కొత్తగా ఒక ఉద్యోగం పుట్టుకొచ్చింది. దాని పేరే ‘డాగ్ వాకర్స్’. ఈ డాగ్ వాకర్స్ ఉద్యోగాలు మహారాష్ట్రలో ప్రస్తుతం హైలైట్ గా మారాయి. కొంతమంది కోటీశ్వరులు సిటీలలో పెంపుడు కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ పెంపుడు కుక్కలను ఉదయం అలాగే సాయంత్రం పూట వాకింగ్కు తీసుకెళ్లలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి యజమానులు ఒక వ్యక్తికి నెలలో రెండు పూటలా వాకింగ్కు తీసుకెళ్తే 15 నుంచి 20వేల రూపాయలు జీతం చెల్లిస్తున్నారు. అలా ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా కూడా ఒక మనిషి 10 కుక్కలను వాకింగ్ కు తీసుకెళ్తే నెల తిరిగే లోపు ఎలా కాదన్నా మూడు లక్షల సంపాదించవచ్చు. ఇంకా ఎక్కువ కుక్కలను వాకింగ్కు తీసుకెళ్తే నాలుగు లక్షల రూపాయలను కూడా సంపాదించవచ్చు. అయితే సిటీలో ఉండే బద్ధకస్తులు ఎక్కువగా ఈ ఉద్యోగాలకు వెళ్తున్నట్లుగా సమాచారం అందుతుంది. కాబట్టి ఏ పని చేయలేని వారు.. సింపుల్గా ఇలా కుక్కలను వాకింగ్కు తీసుకెళ్లడం వల్ల నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.