
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:-యూఏఈ వేదికగా సాగుతున్న ఆసియా కప్ సూపర్-4 కు చేరుకుంది. ఇందులో భాగంగానే నిన్న పాకిస్తాన్ మరియు భారత్ మధ్య హోరాహోరీ గా మ్యాచ్ జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం సాధించింది. ఇక నేడు సూపర్-4 లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు పాకిస్తాన్ మరియు శ్రీలంక మధ్య చావో రేవో మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే ఇండియా చేతిలో నిన్న పాకిస్తాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓడిపోయింది. దీంతో ఇవ్వాళ జరగబోయే మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండడంతో పాటు.. ఓడిపోయిన జుట్టు దాదాపు ఆసియా కప్ టోర్నీ నుంచి తప్పుకున్నట్లే. గెలిచిన జట్టు సూపర్ ఫోర్ లో భాగంగా ఇంకొక మ్యాచ్లో విజయం సాధిస్తే ఫైనల్ కు వెళ్ళిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ మరియు శ్రీలంక దేశాల క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఈ మ్యాచ్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇక రేపు బంగ్లాదేశ్ మరియు భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా వారు నేరుగా ఫైనల్ కు వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు మ్యాచ్ చాలా ఉత్కంఠంగా సాగునుంది. అంతేకాకుండా ఈరోజు మ్యాచ్ లో పాకిస్తాన్ క్రికెటర్స్ ఏమైనా భారత్ ను రెచ్చగొట్టినట్టు శ్రీలంక క్రికెటర్స్ ను కూడా రెచ్చగొడతారా అని ఫ్యాన్స్ కౌంటర్స్ చేస్తున్నారు.
Read also :కాంగ్రెస్ ద్రోహాలతో తెలంగాణకు నష్టం : మాజీ మంత్రి
Read also : ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్… ఏపీలో రెచ్చిపోతున్న వర్షాలు!