ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సర్కార్ కొత్త మద్యం పాలసీలను తీసుకువచ్చిన విషయం అందరికి తెలిసిందే. అందులో భాగంగానే సోమవారం నాడు లాటరీ పద్ధతిలో మద్యం షాపులు అనేవి కేటాయించారు. ఇందులో చాలామంది దరఖాస్తు చేసుకోగా కొంతమందికి మాత్రమే వచ్చాయి. అయితే వీళ్లలో కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఉండడంతో కొంతమంది సిండికేట్లు ఒత్తిడి చేస్తున్నారు.
సాధారణంగా ఒక మద్యం షాపు నిర్వహణ కోసం 40 లక్షల ఖర్చు అవుతాయి. అయితే ఈ డబ్బుని కట్టలేని వాళ్లపై ఇదే ఆసరాగా తీసుకొని కోటి రూపాయలు ఇస్తాం ఈ మద్యం షాపును వదిలేయండి అని కొంతమంది వారిని ఆందోళనకు గురి చేస్తున్నారు. అలాగే కోటి రూపాయలతో పాటుగా నెల నెల 15 వేల రూపాయలు కూడా ఇస్తామని బంపర్ ఆఫర్లు వాళ్ళ ముందు పెడుతున్నారు కొంతమంది ధనవంతులు. దీంతో రాష్ట్రంలో ఈ మద్యం పాలసీ లాటరీలో వచ్చినటువంటి వారి విషయాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బాగా వైరల్ అవుతున్నాయి.
నిన్నటికి నిన్న బాలకృష్ణ నియోజకవర్గమైనటువంటి హిందూపురంలో కూడా లాటరీలో మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ కొత్త మద్యం పాలసీ మద్యం దుకాణం కు భారీగానే డిమాండ్ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కోవాలని చూస్తున్నారు.
దీనివల్ల లాటరీ పద్ధతిలో మద్యం షాప్ దక్కించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇలాంటి కొత్త మద్యం పాలసీపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించాడు.