
క్రైమర్ మిర్రర్, జాతీయ న్యూస్ :- CPI సీనియర్ నాయకుడు అయినటువంటి నారాయణ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి హిడ్మా మరియు ఐ బొమ్మ రవి ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్భుతమైన తెలివితేటలు ఉన్నటువంటి ఈ ఐ బొమ్మ రవి అలా మారడానికి ఈ వ్యవస్థలే కారణమని నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక హిడ్మాను చంపితే వెయ్యిమంది హిడ్మాలు పుట్టుకొస్తారు అని ఆయన అన్నారు. ఇంకోవైపు ఒక ఐ బొమ్మ రవిని చంపితే మరో వందమంది రవిలు పుట్టుకొస్తారు అని వ్యాఖ్యానించారు. కొన్ని కోట్ల రూపాయలను దోచుకుంటున్న వారిని రవి తన తెలివితేటలతో దెబ్బ కొట్టాడని తెలిపారు. నేను కూడా ఒక సినిమాకి 6 నుంచి 700 రూపాయలను ఖర్చు పెట్టలేక ఫ్రీగా వచ్చేటువంటి ఐ బొమ్మలో సినిమాలు చూస్తున్నాను అని అన్నారు. ఈ మూవీ మాఫియాను ఉరితీస్తేనే సమాజానికి ఉపయోగమని అన్నారు. అసలు ఇలాంటివారు ఇలాంటి దారులని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఈ వ్యవస్థలేని సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ. ప్రస్తుతం ఈ సీపీఐ సీనియర్ నాయకుడు అయినటువంటి నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తున్నాయి. మరి ఇతని వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
Read also : నీ కాళ్లు మొక్కుతా తల్లి.. సర్పంచిగా నిలబడు.. మహబూబాబాద్ జిల్లాలో ఆసక్తికర ఘటన!
Read also : Rape Attempt Video: నడిరోడ్డు మీద, అందరూ చూస్తుండగా.. మహిళపై అత్యాచారయత్నం, నెట్టింట వీడియో వైరల్!





