
తెలంగాణలో మంత్రి పదవుల కోసం నేతల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. కొట్లాటలు, మాటల యుద్ధాలు పక్కనపెట్టేసి… ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే అంతుచూస్తాం.. భరతం పడతాం.. కుర్చీ నుంచి దించేస్తాం అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో రాజుకున్న ఈ కుంపటి… కాంగ్రెస్‌లో మరో రగడకు దారితీస్తోంది.
తెలంగాణ కేబినెట్ విస్తరణ… నేతల మధ్య పెద్ద యుద్ధాన్నే తీసుకొస్తోంది. నాకు మంత్రి పదవి కావాలంతే.. అని నేతలు పోటీ పడుతున్నారు. అంతవరకే అయితే… అదో తీరు. కానీ.. ఇప్పుడు వ్యవహారం మరీ శృతిమించేసింది. మా ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వకపోతే నీ అంతు చూస్తామంటూ… సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖ ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచే రావడం కలకలం రేపుతోంది.
Also Read : కోమటిరెడ్డిపై జానారెడ్డి రాజకీయం..రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవికి జానా ఎర్త్..!
ఈ వ్యవహారం రెడ్డి వర్సెస్ ముదిరాజ్ అన్నట్టు మారిపోయింది. ముదిరాజ్ వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు ఆయన అభిమానులు. శ్రీహరికి మినిస్టర్‌గిరి ఇవ్వకుంటే ఊరుకోమని… భరతం పడతామంటూ ముఖ్యమంత్రితోపాటు మంత్రులను బెదిరిస్తూ లేఖలు రాశారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. ముదిరాజ్ అభిమాన సంఘం పేరుతో ఉన్న ఈ లేఖలు మక్తల్‌లోని కొందరికి పోస్టుల ద్వారా చేరాయి. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కింది.
Also Read : పనులు మంచివే… ప్రచారమే నిల్ -కాంగ్రెస్‌లో గడ్డుపరిస్థితి-ఎందుకీ దుస్థితి..!
మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి అనుచరులు మాత్రం… ఆ లేఖలతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. కొంతమంది కావాలనే.. గందరగోళం సృష్టిస్తున్నారని చెప్తున్నారు. లేఖ రాసిన వారిపై కేసులు కూడా పెడతామంటున్నారు ఎమ్మెల్యే అనుచరులు. ఎమ్మెల్యే అనుచరులు కాకపోతే… ఆ లేఖలు ఎవరు రాసుంటారు..? ఆ అవసరం ఎవరికి ఉంటుంది…? ఎమ్మెల్యే వర్గీయులు కాకపోతే ఇంకెవరు…? అన్న ప్రశ్నలు మక్తల్ నియోజకవర్గంలో మారుమోగుతున్నాయి. ఏది ఏమైనా… ముదిరాజ్ అభిమాన సంఘం పేరుతో వచ్చిన ఈ లేఖలతో నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. రాసింది ఎవరో… రాయించింది ఎవరో తేల్చే పనిలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం.
ఇవి కూడా చదవండి ..
-
సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు
-
నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!
-
అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్
-
సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్
-
ఏపీలో లిక్కర్ స్కామ్ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్ వైపుకా..!