ఇకపై గోవాలో అలా చేస్తే జైలుకే..?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఈ రోజుల్లో ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గోవా టూర్ కి వెళ్లి ఎంజాయ్ చేయడం ఫ్యాషన్ గా మారింది. అయితే తాజాగా ఈ గోవా టూర్ లో కూడా కొన్ని రూల్స్ పెట్టేసారు. గోవాలో ఇకనుండి ఇష్టానుసారంగా ఫోటోలు మరియు వీడియోలు తీస్తే ఖచ్చితంగా 24 గంటలపాటు జైల్లో గడపాల్సి ఉంటుంది అని పోలీసులు హెచ్చరించారు. పర్మిషన్ లేకుండా విదేశీయులు లేదా ఇండియన్స్ ఫోటోలు తీసిన లేదా సెల్ఫీల కోసం వేధించినా జైలు లో వేస్తామని పోలీసులు రూల్స్ పెట్టారు. గోవా టూర్కు వచ్చినటువంటి ఇండియన్స్ లేదా విదేశీయులు ఇక్కడ పరిస్థితులు చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఎక్కువగా విదేశీయులను ఫోటోలు తీస్తాము అంటూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫోటోగ్రాఫర్లు వేధిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతోనే ఈరోజు కొన్ని ఆంక్షలు పెట్టాల్సి వచ్చింది అని పోలీసులు తెలిపారు. టూరిస్టుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు. ఇకపై ఎవరైనా సరే గోవాకు వచ్చేటువంటి వ్యక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చూపించారు. అయితే టూరిస్టుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఇటువంటి రూల్స్ పెట్టినందుకుగాను పోలీసుల నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది పాజిటివ్ గా కామెంట్లు చేస్తూ ఉన్నారు. తాజాగా నార్త్ గోవా బాగా బీచ్ లో టూరిస్టులను వేధించినందుకుగాను తమిళనాడుకు చెందిన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం గోవాలో ఇకపై అనుమతులు లేకుండా ఫొటోస్ కోసం లేదా వీడియోస్ కోసం వేధిస్తే వారు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది అని హెచ్చరించారు.

Read also : అంత పిచ్చెందుకు మరీ!.. మహిళ ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి

Read also : పెళ్లి కాలేదని డిప్రెషన్.. 20వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button