
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడమే కష్టంగా మారింది. ఎంతో కష్టపడి చదువుకొని చిన్నాచితక ఉద్యోగం సంపాదించిన ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రులను పోషించడానికి ఏదో ఒక చిన్న ఉద్యోగం సాధించుకొని ఆ ఉద్యోగంలో సంతోషం లేకపోయినా తప్పని పరిస్థితులలో కాలాన్ని గడుపుతూ కుటుంబ పోషణ కోసం ముందుకు వెళుతున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా?.. అయితే చెబుతాను తెలుసుకోండి.
Read also : బ్రేకింగ్ న్యూస్.. మునుగోడులో మోటారు వైర్ల దొంగల బీభత్సం
ఒక ఉద్యోగి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ నాకు ఈ రోజు సెలవు కావాలి అని.. తలనొప్పిగా ఉంది అంటూ మేనేజర్ ను సెలవు అడిగారు. అయితే ఆ ఉద్యోగికి మేనేజర్ ఏమని రిప్లై ఇచ్చాడో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది నిజమో కాదో తెలుసుకోవడానికి ఏకంగా ఉద్యోగిని లైవ్ లొకేషన్ షేర్ చేయాలి అని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తలనొప్పిగా ఉంది అని మేనేజర్ ను సెలవు అడిగితే అతను డైరెక్ట్ గా లైవ్ లొకేషన్ షేర్ చేయాలి అని అడగడం ఏంటి అని.. ఇది ఒక మేనేజర్కు ఉండాల్సిన లక్షణమా అంటూ ఆ ఉద్యోగి వాట్సాప్ చాట్ అంతా కూడా రాడిట్ ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయాన్ని చదివిన ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది నెటిజనులు మేనేజర్ తీరుపై తీవ్రంగా మండిపడుతుండగా మరికొందరు మాత్రం ఒక ఉద్యోగి ప్రైవసీని ఉల్లంఘించడం ఏంటి.. ఎవరు కూడా ఎటువంటి పరిస్థితులలో లొకేషన్ షేర్ చేయొద్దు అని సూచిస్తున్నారు.
Read also : అసలే శీతాకాలం.. పైగా దగ్గు వస్తుందా?.. అయితే పడుకునే ముందు ఇలా చేయండి!





