
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులు ఒక్కొక్కరుగా తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మనకు తెలంగాణ దిష్టి తగిలింది అని.. మన రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనము ఒక కారణమై ఉంటుంది అని.. కొంతమంది దిష్టి వల్లనే ఇలా జరిగిందని ఇన్ డైరెక్ట్ గా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన నేపథ్యంలో మా రాష్ట్ర ప్రజలను తప్పు పట్టడం తప్పు అని తెలంగాణ మంత్రులు ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు సోదర భావంతో మెలిగేటువంటి రాష్ట్రాలని అన్నారు. తుఫాన్ కారణంగా తెలంగాణ మునుగుతుంటే మేము దానిని ప్రకృతి విపత్తు అనుకున్నాం. అంతేకానీ తుఫాన్ ఏపీ వల్ల వచ్చిందని ఏపీ ప్రజలను తప్పు పట్టలేదు. అక్కడెక్కడో చెట్లు ఎండితే అది మా దిష్టి వల్ల తగిలింది అంటే అది ఎంతవరకు సమంజసం అని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది ఒక అవమానకరం లాంటి సంఘటన అని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలి అని మంత్రి పూర్ణం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Read also : జగన్ విమానాల లెక్కలు బయటపెట్టిన నారా లోకేష్!
Read also : సీఎం ఫిర్యాదుదారులను బెదిరించి మరీ కేసులను మూయిస్తున్నారు : బొత్స సత్యనారాయణ





