
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ప్రస్తుతం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తూ కోటి సంతకాలను సేకరించారు. ఇక తాజాగా ఈ కోటి సంతకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కు సమర్పించి చంద్రబాబు నాయుడు చేస్తున్న స్కామ్ గురించి వివరించామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద ప్రజలందరూ కూడా వైద్యం కోసం తమ ఆస్తుల అమ్ముకోవాల్సి వస్తుందని జగన్ తీవ్రంగా ఆరోపించారు.
Read also : BIG ALERT: భీకరమైన చలి.. ప్రజలు జాగ్రత్త.. స్కూల్ టైమింగ్స్ కూడా మార్పు
ఈ రాష్ట్రంలో స్కూళ్లు అలాగే ఆసుపత్రులను ప్రభుత్వం నడపకపోతే ఆ సేవలు పేదలకు భరించలేనివిగా మారిపోతాయి అని స్పష్టం చేశారు. దాదాపు 8 వేల కోట్లతో మా ప్రభుత్వంలో 17 కాలేజీలకు భూములు సేకరించి ప్రారంభించాం. అందులో దాదాపు ఏడు కాలేజీలు అందుబాటులోకి రాగా మిగతావి నిర్మిస్తున్న క్రమంలో ఉండగా ప్రభుత్వం మారిపోయింది అని.. ఈ ప్రభుత్వానికి చేతకాక ఇలా ఈ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేస్తున్నారని… ప్రజలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అని తెలియజేయడానికి ఈ కోటి సంతకాలు సరిపోవా అని నిలదీశారు. ఒకవేళ ఈ ప్రభుత్వంలో మీరు కట్టడం చేతకాకపోతే.. మా ప్రభుత్వం వచ్చాక పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
Read also : ZPTC, MPTC ఎన్నికలపై సీఎం రేవంత్ క్లారిటీ





