
క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:-టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. మన టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మను ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ లోని యంగ్ హీరోలతో సినిమాల్లో నటించడమే కాకుండా రొమాన్స్ సీన్స్ లలోనూ బాగానే నటిస్తున్నారు. దీంతో కొంతమంది ఫ్యాన్స్ కూడా ఆ రొమాన్స్ సీన్స్ చూసి అనుపమ పై ఫైర్ అవుతున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ గతంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెబుతున్న విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వ వైరల్ అవుతున్నాయి.
Read also : నేడే చివరి వన్డే… తెలుగు ప్లేయర్ అవుట్?
సినిమా కెరీర్ ప్రారంభంలో ట్రోల్స్ వల్ల నేను ఎంతో బాధపడ్డాను అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా కెరీర్ బిగినింగ్ లో ఓ స్కూల్ ఈవెంట్ కు వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా.. కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే పాన్ షాప్ ఈవెంట్లకు కూడా వెళ్తారు అని తనపై దారుణంగా ట్రోల్స్ చేశారని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా?.. అని ఇంటర్వ్యూ చేసే అతను ప్రశ్నించగా… తల్లిదండ్రుల అనుమతి తీసుకొని కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని దీటుగా జవాబు ఇచ్చారు. నేను సర్వసాధారణ మనిషిని అని… ఏదో డబ్బున్న వ్యక్తిలా వ్యవహరించను అని… డైట్ కూడా పాటించనని .. నాకు నచ్చిన ఫుడ్ తింటూ ఆనందంగా గడుపుతుంటానని అన్నారు.
Read also : త్వరలోనే దేశమంతటా మావోయిజం, నక్సలిజం లేకుండా చేస్తాం : ప్రధాని మోదీ





