
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- సినిమా పరిశ్రమలో ఉన్న వ్యక్తులకు ఎన్నో అలవాట్లు ఉంటాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి చాలానే ఆస్తులు ఉంటాయి. అవి ఎంతో కూడా మనం ఊహించలేం. కానీ ఆ రోజుల్లోనే ఎంతో ధనం ఉన్నా… కొన్ని వ్యసనాల వల్లనో లేదా కొన్ని అనుకోని సందర్భాల వలనో ఆ డబ్బంతా కూడా పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఈ విషయం గురించి ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ హీరో, విలన్ గా నటించిన జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో తన ఆర్థిక విషయాల గురించి పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా జగపతిబాబు చేసిన వ్యాఖ్యలు చాలానే వైరల్ అవుతున్నాయి. డబ్బు పట్ల తనకు ఉన్న వ్యక్తిత్వం ఎలాంటిదో వివరించారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా కూడా సినిమా నటుల ఆస్తుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే నేడు జగపతిబాబు తన ఆస్తుల వివరాలు… ఎందుకు 1000కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారో.. కూడా వివరించారు.
Read also : రెండవ రోజు గాయత్రి రూపంలో అమ్మవారు దర్శనం
డబ్బు అనేది కేవలం ఒక సాధనం గా చూస్తానని… తనకు ఆస్తులు పట్ల ఎలాంటి ఆసక్తి లేదని జగపతిబాబు చెప్పుకొచ్చారు. అధిక ధనం వల్ల ఉపయోగం ఏమి లేదని… కాకపోతే లగ్జరీగా బతకొచ్చు అని అన్నారు. కానీ ఇక్కడ డబ్బు కంటే కుటుంబం, ఆరోగ్యం అలాగే సంతోషం అనేవి చాలా ముఖ్యమని జగపతిబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నా జీవితంలో చాలా డబ్బును వృధా చేశాను అని చెప్పుకొచ్చారు. దానధర్మాలు , కుటుంబ ఖర్చులు, మోసాలు అలాగే వ్యసనాల కారణంగా ఎంతో డబ్బును కోల్పోవడం జరిగిందని అన్నారు. కానీ ఎవరిని కూడా నిందించలేము… అది మొత్తం మన తప్పిదాల వల్లే జరుగుతుందని.. ఆ తప్పిదాలను పాఠాలుగా నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చారు. అధికంగా డబ్బును సంపాదించాలనే ఆశ నాకు లేదు.. ఒక 30 కోట్లతో మా కుటుంబమంతా కూడా జీవితకాలం హాయిగా జీవించవచ్చని.. జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యసనాలకు, వృధా ఖర్చులు, దాన ధర్మాలు చేయకుంటే నేటికీ 1000 కోట్లు ఉండేవని జగపతిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు కన్నా కుటుంబానికి ఎక్కువ వ్యాల్యూ ఇస్తున్నందుకు గాని జగపతిబాబుపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read also :కేంద్రం ఆదేశాలను పాటించరా… ధరలను ఎందుకు తగ్గించలేదు?