Sunday, March 22, 2026
Homeఆంధ్ర ప్రదేశ్అన్ని నేనే చేస్తే ఇక మీరెందుకు.. పార్టీ నాయకులపై పవన్ కళ్యాణ్ సీరియస్?

అన్ని నేనే చేస్తే ఇక మీరెందుకు.. పార్టీ నాయకులపై పవన్ కళ్యాణ్ సీరియస్?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తన పార్టీ నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నాయకులు లడ్డు కల్తీ వ్యవహారంపై దుష్ప్రచారం చేస్తున్న కూడా పార్టీ నాయకులు ఎందుకు వాటిని తిప్పి కొట్టడం లేదు అని.. ఎందుకు వాటిపై స్పందించట్లేదు అని నాయకులపై మండిపడ్డారు. ఇక ప్రతి విషయంలోనూ నేనే మాట్లాడితే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మీరు ఎందుకు అని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి దృశప్రచారంపై ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడాలి కదా?.. అని పార్టీ నాయకులను నిలదీసి అడిగారు. అలాగే ఈ మధ్య జనసేన ఎమ్మెల్యే న్యూడ్ వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు కూడా మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని సూచించారు. ఏది ఏమైనా కూడా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ తమ పార్టీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also : Shocking Wedding Twist: పెళ్లి కొడుకుపై హత్యాయత్నం.. పెళ్లి కూతురి ఏడుపు.. సీన్ కట్ చేస్తే షాకింగ్!

Read also : Shocking Wedding Twist: పెళ్లి కొడుకుపై హత్యాయత్నం.. పెళ్లి కూతురి ఏడుపు.. సీన్ కట్ చేస్తే షాకింగ్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments