
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రతిరోజు కూడా మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ హరీష్ రావు రాజకీయాలకు అన్ఫిట్ అని అన్నారు. దీంతో బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హరీష్ రావు స్పందించారు. హరీష్ రావు స్పందిస్తూనే బట్టి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుంది అని బట్టి విక్రమార్క పై అసహనం వ్యక్తం చేశారు. నేను రాజకీయాలకు అన్ఫిట్ అంట… దేనికి అన్ఫిట్ అనేది చెప్పాల్సిన అవసరం ఉంది అని హరీష్ రావు ప్రశ్నించారు. నేను గత మా ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు మీలా 20% లేదా 30% కమిషన్లు తీసుకోలేదే అని ఎద్దేవా చేశారు. ఇకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజైనా కూడా గతంలో కాంట్రాక్టర్లు వచ్చి ఆర్థిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేసినట్లు చూశారా?.. అని ప్రశ్నించారు. రాజకీయాలలో ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ అనేది ప్రజలకు తెలుసు అని హరీష్ రావు అన్నారు. గతంలో సర్పంచులు గాని, ఎంపిటిసిలు కానీ బయటకు వచ్చి ఏదైనా సమస్య గురించి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి అని.. నోరు పారేసుకున్నాక ఎవరు ఏం చేయలేము అని అన్నారు. మీరు గౌరవించి మాట్లాడితే మేము కూడా గౌరవించి మాట్లాడుతామని అన్నారు.
Read also : రైతులను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నావా?.. చంద్రబాబుపై మండిపడ్డ జగన్!
Read also : రోహిత్ సిక్సర్ల రికార్డు ను బ్రేక్ చేసే దమ్ము ఎవరికి ఉంది?





