
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్ సిపి సజ్జనార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐ బొమ్మ రవికి సపోర్ట్ చేస్తూనే మరోవైపు సజ్జనార్ పై పూర్తిస్థాయిలో మండిపడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశాడు మల్లన్న. ఐ బొమ్మ రవి నిజంగానే దమ్మున్నోడు అని.. తన భార్య పట్టించకపోతే అతనిని పట్టుకోవడం మీ వల్ల అయ్యేది కాదు అని అన్నారు. సినిమా వాళ్ళు ఏమైనా సంసారుల అంటూ ప్రశ్నించారు. నిజమైన దోపిడీ దొంగలను పక్కన కూర్చోబెట్టుకున్నారు అంటూ పరోక్షంగా సినిమా నటుల గురించి మండిపడ్డారు. అత్యాచార బాధితులతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా?.. అని విమర్శించారు. సినిమాలను పైరసీ చేసిన వ్యక్తిని చివరికి తన భార్య పట్టిస్తే పట్టుకున్నారు. అది ఎంతో పెద్ద నేరంగా చూసిన మీరు అన్ని థియేటర్లలో పాప్కాన్ 300 రూపాయలు, వాటర్ బాటిల్ ధర 50 రూపాయలకు పైగా ఉంటే మాత్రం ఇది దోపిడీగా మీకు కనిపించట్లేదా అని సజ్జనార్ ను నిలదీశారు. థియేటర్లో భారీ ధరలతో మీరు చేసేది దోపిడీ కాదా? అని.. సినిమా నటులే థియేటర్ల విషయంలో ఎంత బాగా నటిస్తున్నారో కనిపించట్లేదా అని ప్రశ్నించారు. నీ జీవితం మొత్తం కూడా ఫేక్ ఎన్కౌంటర్లే అని.. ఐ బొమ్మ రవి నిజమైన దమ్మున్నోడు అని తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also : “స్టూడెంట్ అసెంబ్లీ” కార్యక్రమం.. ప్రత్యక్షంగా వీక్షించునున్న సీఎం
Read also : అన్నీ ఎక్కువే.. పూర్తిగా మారిపోతున్న వాతావరణ పరిస్థితులు..?





