
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై రాష్ట్రంలో చార్జీలు పెంచిన బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ కారణంగా పట్టణాల్లోని ప్రజలందరూ కూడా తమ సొంత గ్రామాలకు వెళుతున్న క్రమంలో రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ రద్దీనే ఆసరాగా తీసుకొని చాలామంది ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు విపరీతంగా చార్జీలు పెంచుతున్నారు అని.. ప్రజల రద్దీని అవకాశంగా తీసుకొని చార్జీలు పెంచితే కచ్చితంగా ఆయా బస్సులను సీజ్ చేస్తాము అని తాజాగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ హెచ్చరించారు. ప్రతి ఒక్క అధికారి కూడా బస్సు చార్జీలకు సంబంధించి నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారు అని వెల్లడించారు.
Read also : నా పెళ్లికి చాలా సమయం ఉంది.. రూమర్స్ నమ్మకండి : మీనాక్షి చౌదరి
ముఖ్యంగా ప్రముఖ పట్టణాలు అయినటువంటి హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నై నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తిరిగేటువంటి బస్సులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రకటించారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆయా బస్సులలో ప్రయాణించేటువంటి ప్రయాణికులను కూడా అడిగి మరీ ఫీడ్ బ్యాక్ తీసుకుంటాము అని అన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం ప్రకటించిన చార్జీల కన్నా ఎక్కువ వసూలు చేస్తే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రయాణికులు కూడా చార్జీల విషయంలో మీకు అసంతృప్తి అనిపించిన లేదా ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నారు అని అనిపించినా కూడా వెంటనే అధికారులకు తెలియజేయవచ్చు అని అన్నారు. కాగా మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలలోనీ బస్టాండ్స్ అన్నీ కూడా రద్దీగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రైవేట్ బస్సు డ్రైవర్లు చార్జీలు పెంచుతున్నారని అధికారుల దృష్టికి రావడంతో ఈ ఈ విధంగా హెచ్చరించారు.





