
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు అతిగా ఫోన్ ను చూడడం ఫ్యాషన్ గా మారిపోయింది. తల్లిదండ్రులు కూడా తమ బిజీ షెడ్యూల్సులలో పిల్లలను మర్చిపోవడం సహజంగా మారింది. తల్లిదండ్రులు వారి పనులలో వారు బిజీగా ఉండడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా సరిగా పట్టించుకోవడం లేదు. ఫోన్లకు అలవాటు పడ్డ చిన్న పిల్లలు తినే సమయంలోనూ సెల్ ఫోన్ చూపిస్తే కానీ తినను అంటూ మారం చేస్తున్న రోజులను మనం చూస్తున్నాం. అయితే తాజాగా వైద్య నిపుణులు వెల్లడించిన అధ్యయనంలో ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లలు అతిగా ఫోన్ ను చూడడం వల్ల ఆలస్యంగా మాటలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అతిగా మొబైల్ ను అలాగే టీవీలను చూసేలా అలవాటు చేస్తే కచ్చితంగా వారి భవిష్యత్తుకు ప్రమాదం అని అంతర్జాతీయ సర్వే కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లలకు ఫోన్లకు అలాగే టీవీలకు కాస్త దూరంగా ఉంచాలి అని… అలా చేయని పక్షంలో కచ్చితంగా పిల్లలకు మాటలు రావడం ఆలస్యం అవుతుంది అని ఆ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా కొత్త పదాలు నేర్చుకునే సామర్థ్యం అయితే పూర్తిగా తగ్గిపోతుంది అని వెల్లడించారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏ క్షణంలో ఏం చేస్తున్నారో గమనిస్తూనే ఉండాలి అని.. ఐదు లేదా ఆరు సంవత్సరాలు వచ్చే అంతవరకు కూడా పిల్లల్లో కదలికలను చూస్తూనే ఉండాలి అని సూచించారు. ఒకవేళ పిల్లల మీద ఎక్కువ ఇష్టం ఉంటే… పిల్లలకు మొబైల్ చూపించడం తప్పనిసరి అయితే ఏవైనా నాలెడ్జ్ అనిపించే వీడియోలను చూపించాలి అని.. అది కూడా కొంత సమయం మేరకే చూపించాలి అని వెల్లడించారు.
Read also : బ్రేకింగ్ న్యూస్… రాజకీయ నేతల వాట్సప్ గ్రూపులు హ్యాక్?
Read also : తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న నోబెల్ విన్నర్!





