క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రంగారెడ్డి జల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో 10రోజుల వ్యవధిలోనే ముగ్గురు అదృశ్యమవడం తీవ్రకలకలం రేపుతోంది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న ముగ్గురు మిస్సింగ్ అవ్వడం అటు తల్లిదండ్రులలో, ఇటు కాలేజీ యాజమాన్యంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులు అదృశ్యమైనట్లు కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 14న 17ఏళ్ల కొత్తగడి విష్ణు మిస్సైనట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18న 17 ఏళ్ల కొంగరి శివాని అదృశ్యమైనట్లు కాలేజీ జనరల్ మేనేజర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 19 ఏళ్ల ఉప్పల పావని ఈనెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదని తల్లి ఉప్పల కృష్ణవేణి పిర్యాదు చేశారు. తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం పిర్యాదు మేరకు పోలీసూలు కేసు నమోదు చేసుకొని వారి కోసం గాలిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమవ్వడంతో ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. కాలేజ్‌కి ఫోన్ చేసి వివరాలు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేటీఆర్?
- రెండు కాళ్లు లేకపోయినా శబరిమలకు పయనం?
- కేసీఆర్, హరీష్‌రావులకు హైకోర్టులో ఊరట.. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ
- సీన్ ఆఫ్ అఫెన్స్… సినీ నటుడు అల్లు అర్జున్ మరోసారి సంధ్య థియేటర్‌కు
- రేవంత్ పై హైకమాండ్ సీరియస్.. అల్లు ఎపిసోడ్‌లో ఎవరూ మాట్లాడొద్దని వార్నింగ్!