
క్రైమ్ మిర్రర్, క్రైమ్ న్యూస్ :- గత చాలా రోజుల నుంచి పైరసీ మాఫియా అనేది టాలీవుడ్ కు పెద్ద తలనొప్పిగా మారిపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒకవైపు ప్రజలందరూ కూడా ఈ పైరసీ వెబ్సైట్లను ఓపెన్ చేసి ఫ్రీగా సినిమాలను చూస్తూ కాలాన్ని గడుపుతుంటే మరోవైపు ఇది పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది అని సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐ బొమ్మ మరియు బప్పం టీవీ నిర్వాహకుడు రవిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని ఆ సైట్లను బ్లాక్ చేసిన కూడా మరోవైపు నుంచి మూవీ రూల్జ్ మాత్రం తన దారులు మార్చుకుంటూ వేగంగా సినిమాలను పైరసీ చేస్తున్నాయి. ఐ బొమ్మ సైట్ ప్రస్తుతం పని చేయకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మూవీ రూల్జ్ పైపడ్డారు. దీంతో దొరికిందే సందు అని మూవీ రూల్స్ నిర్వాహకులు కూడా వేగంగా తమ వెబ్ సైట్లలో విడుదలైన సినిమాలను అప్లోడ్ చేస్తున్నారు. ఇలా శుక్రవారం విడుదలైన సినిమాలు ఒక్క రోజు కూడా గడవకముందే మూవీ రూల్స్ లో ప్రత్యక్షం అవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుత కాలంలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలి అంటే సినిమా టికెట్ ధరలు అలాగే థియేటర్ లోని తినుబండారాల ధరలు చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అందువల్లే సినిమాను చూడడానికి థియేటర్లకు వెళ్లకుండా నేరుగా ఇంట్లోనే మొబైల్ లో చూసేస్తున్నారు. థియేటర్లో కెమెరాతో రికార్డ్ చేసిన ప్రింట్లను విడుదలైన రోజునే ఈ మూవీ రూల్జ్ నిర్వాహకులు తమ వెబ్సైట్ లో అప్లోడ్ చేయడంతో జనాలు కూడా క్వాలిటీ లేకపోయినా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఐ బొమ్మ రవి పై పోలీసులు విచారణ చేస్తూ ఉంటే మరోవైపు మాత్రం మూవీ రూల్జ్ నిర్వాహకులు మమ్మల్ని పట్టుకోలేరంటూ సవాల్ విసురుతున్నారు. దీంతో టాలీవుడ్ కు ఈ పైరసీ మాఫియా ఎటువంటి తెరలకు దారితీస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
Read also : సత్యసాయి బాబా ఘనతలు మరువలేనివి.. ప్రశంసించిన ప్రముఖ రాజకీయ నేతలు!
Read also : నా కొడుకుని కాదు.. ముందు నిన్ను ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది!





