
-
ఈడీ ఎదుట విచారణకు హాజరైన ప్రకాశ్‌రాజ్
-
ఐదు గంటల పాటు కొనసాగిన ఈడీ విచారణ
-
బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
-
అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న ప్రకాశ్‌రాజ్
-
ఈడీ మళ్లీ విచారణకు పిలవలేదని వెల్లడి
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోషన్ కేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించింది. సుమారు ఐదుగంటల పాటు జరిగిన విచారణలో ప్రకాశ్‌రాజ్ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు వివరించారు. తాను చెప్పిన విషయాలను ఈడీ అధికారులు రికార్డు చేసుకున్నారన్నారు. మళ్లీ విచారణకు రావాలని ఈడీ అధికారులు పిలవలేదని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు.
ఈడీ విచారణ అనంతరం ప్రకాశ్‌రాజ్ మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం విషయంలో నిర్వాహకుల నుంచి తనకెలాంటి అమౌంట్ అందలేదని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా డబ్బు సంపాదించాలని ఎవరూ కోరుకోవద్దని ఆయన సూచించారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ విషయంలో ఇకపై తాను దూరంగా ఉండనున్నట్లు స్పష్టం చేశారు.
దుబాయ్ నుంచి చెలామణిలో ఉన్న కొన్ని బెట్టింగ్ యాప్స్‌ను ప్రకాశ్‌రాజ్ ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని బుబాయ్‌లోనే పెట్టుబడులకు మళ్లించారని ఈడీ అనుమానిస్తోంది. ప్రకాశ్‌రాజ్‌కు చెందిన బ్యాంక్ అకౌంట్లను, లావాదేవీలను పరిశీస్తున్నారు. గత ఐదారేళ్లలో జరిగిన ట్రాన్సాక్షన్స్‌ను పరిశీలిస్తున్నారు. అయితే గతంలో జంగిల్ రమ్మీకి ప్రకాశ్‌రాజ్ ప్రమోషన్ ఇచ్చారు. ఈ యాప్‌తో కాంట్రాక్ట్ ముగిశాక మళ్లీ రెన్యూవల్ చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.
Read Also: