
బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులపై.. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రియాక్షన్ చర్చనీయాంశమైంది. ఆయన కాస్త వైరాగ్యంగా మాట్లాడారంటూ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ సల్మాన్ ఖాన్ ఏమన్నారు… ? అసలు ఏం జరిగింది..?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి థ్రెట్ ఉంది. ఎంతో కాలంగా సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నిస్తోంది. ఆయన ఇంటిపై ఇటీవల కాల్పులు కూడా జరిగాయి. బైక్‌పై వచ్చిన యువకులు ఫైరింగ్ చేసి వెళ్లిపోయారు. ఆ కాల్పులకు పాల్పడింది తన గ్యాంగే అని… బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఆ సంఘటన తర్వాత.. సల్మాన్ ఖాన్‌కు భద్రత పెంచింది మహారాష్ట్ర ప్రభుత్వం.
సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం సికిందర్. ఈ సినిమా ప్రమోషన్‌లో సల్మాన్ ఖాన్‌ను.. బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులపై ప్రశ్నించారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన సమాధానం చర్చకు దారితీసింది. రాసిపెట్టినంతకాలం బతుకుతానని… సల్మాన్ ఖాన్ చెప్పారు. తన జీవితం దేవుడి చేతుల్లో ఉందని, ఆయన ఎంతకాలం జీవించాలని రాసుంటే అంతకాలం ఉంటానని చెప్పారు. అంతేకాదు.. ఎవరు ఎంతకాలం బతకాలన్నది దేవుడు ముందే రాసిపెట్టి ఉంటాడని చెప్పారు సల్మాన్ ఖాన్. ఆయన నోట.. ఈ మాటలు విన్నవారు.. కాస్త వైరాగ్యం కనిపించిందని చర్చించుకుంటున్నారు.
Also Read : ప్రమాదమా..? హత్యా..? 12 సెకండ్ల ముందు ఏం జరిగింది – పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఎన్నో అనుమానాలు..!
కృష్ణ జింకలను వేటాడిన ఘటనకు సంబంధించి.. సల్మాన్ ఖాన్ హత్యకు ప్లాన్ చేస్తోంది బిష్ణోయ్ గ్యాంగ్. ఆయన బహిరంగ క్షమాపణ చెప్తేనే వదిలేస్తామని అంటోంది. లేదంటే… తమ చేతుల్లో సల్మాన్ ఖాన్ మరణం తప్పదని ఇప్పటికే పలు మార్లు హెచ్చరించింది బిష్ణోయ్ గ్యాంగ్. ఇప్పటికే.. ఆ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు ముప్పు పొంచిఉంది. దీంతో… సల్మాన్ ఖాన్ చుట్టూ ఎప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది. సినిమా షూటింగ్‌లు కూడా భద్రతా సిబ్బంది మధ్య జరుగుతాయి.