
-పడకల్ గ్రామపంచాయతీ అభివృద్ధి చేసి చూపిస్తా!
-జిల్లాలోనే పడకల్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
-పడకల్ సర్పంచ్ డోకూరి సునీతా ప్రభాకర్ రెడ్డి
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- ఇచ్చిన మాట ప్రకారం పడకల్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని రంగారెడ్డి జిల్లా, పడకల్ గ్రామ సర్పంచ్ డోకూరి సునీతా ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మలిదశ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా డొకోరి సునీత ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆదివారం పడకల్ గ్రామంలో భారీ విజయవత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ డీజే పాటలతో గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పడకల్ గ్రామాన్ని సొంత నిధులతోనూ.. ప్రభుత్వం నిధులతో అన్ని మౌలిక వసతులు కల్పించి అభివృద్ధిలో జిల్లాలోనే అగ్రగామిగా నిలుపుతానని హామీ ఇచ్చారు.
Read also : TV Price Hike: వెంటనే టీవీలు కొనేయండి, లేదంటే జేబుకు చిల్లు పడటం ఖాయం!
Read also : Hydrogen Train: పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ రైలు, రైల్వేమంత్రి కీలక ప్రకటన!





