
పెబ్బేరు, క్రైమ్ మిర్రర్ :- పెబ్బేరు మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం టి యు డబ్ల్యూజె ఐ జే యు సన్మాన కార్యక్రమం సభలో 1988 లో ఉదయం పేపర్ జర్నలిస్టుగా కొనసాగిన,ఆంధ్రప్రభ లో ప్రబోధించే పాత్రికేయుడుగా వార్త పేపర్లో వార్త శీనన్నగా,నమస్తే తెలంగాణలో శీనన్నగా పాత్రికేయ వృత్తిలొ 37 సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేసి తెలంగాణ టి యు డబ్ల్యూజె ఐజేయు కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ టి యు డబ్ల్యూ జే ఐ జే యు రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు మాధవరావు, నియోజకవర్గం అధ్యక్షుడు విజయ్ కుమార్, పెబ్బేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలవర్ధన్, ప్రధాన కార్యదర్శి సూర్యవంశం పరుశురాముడు చేతుల మీదుగా ఘనంగా శాలువా పూలదండలతో మెమొంటంతొ ఘనంగా సత్కరించడం జరిగింది.
Read also : అద్భుతంగా తిరుపతి బస్ స్టేషన్ ను నిర్మించాలి : సీఎం చంద్రబాబు
టి యు డబ్ల్యూ జే ఐ జేయు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. ఉదయించే సూర్యుడిలా ఉదయం పేపర్ నుండి ఆంధ్రప్రభ,వార్త,నమస్తే తెలంగాణ పేపర్ లో 37 సంవత్సరాలు వార్తలు రాస్తూ పేపర్ యజమానిలతో కష్ట సుఖాలు అనుభవిస్తూ జర్నలిస్టుగా గుర్తింపు పొందిన నారాయణదాసు శ్రీనివాసులు తెలంగాణ టి యు డబ్ల్యూ జే ఐ జే యు కౌన్సిల్ నెంబర్ గా కు ఎన్నికైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మాధవరావు మాట్లాడుతూ పాత్రికేయ వృత్తికి జీవితం అంకిత చేసి యువ జర్నలిస్టుకు అండగా ఉంటూ తెలియని విషయాలు తెలిపి అందరిని సర్దుకపోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూజె ఐ జే యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు,సీనియర్ పాత్రికేయులు మల్యాల బాలస్వామి,ప్రశాంత్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పెద్ది బాలరాజు,జిల్లా కోశాధికారి మన్యం, పెబ్బేరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ,కిరణ్ కుమార్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాసులు,శంకర్ నాయుడు, తరుణ్, అతిక్ పాషా,హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read also : ఈ జిల్లాలకు హెచ్చరిక!.. రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షాలు