
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- మన టాలీవుడ్ లో హీరోయిన్ సౌందర్య అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు టాలీవుడ్ ను హీరోయిన్ సౌందర్య ఏలింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. తెలుగు ఆడియన్స్ పెద్దలు, చిన్న పిల్లల మనసుకు చాలా దగ్గరైన మనిషి ఆవిడ. అలాంటి సౌందర్య ఎవరు ఊహించినటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా మరో హీరోయిన్ మీనా,సౌందర్య మరణ వార్త సంఘటన గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.
Read also : యూరియాను బ్లాక్ లో అమ్ముకున్న MLA గన్ మెన్.. కాంగ్రెస్ పాలనపై రైతులు ఫైర్
తాజాగా జగపతిబాబు “జయము నిశ్చయమ్మురా” అనే టీవీ షోలో భాగంగా ఒకప్పటి హీరోయిన్స్ మీనా మరియు సిమ్రాన్ పాల్గొన్నారు. ఈ షోలో భాగంగా ఒకప్పటి రోజులను ఇద్దరు హీరోయిన్స్ కూడా మరోసారి గుర్తు చేశారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే.. నటి మీనా హీరోయిన్ సౌందర్య చనిపోయిన సందర్భం మరోసారి లేవనెత్తారు. అసలు ఆరోజు సౌందర్య తో పాటు కలిసి నేను కూడా ప్రయాణించాల్సి ఉంది అని జగపతిబాబు షోలో షాకింగ్ విషయాలను బయటపెట్టారు. సౌందర్య తో పాటుగా నన్ను కూడా ఆ క్యాంపియన్ కు ఆహ్వానించారు. కానీ అప్పుడు నేను సినిమా షూటింగ్స్ లలో బిజీగా ఉండడం.. అలాగే ఆ క్యాంపైన్లు అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు అని.. సౌందర్యతో నేను రాలేను అని చెప్పాను. దీంతో నేను ఆగిపోవాల్సి వచ్చింది.. కానీ సౌందర్య మాత్రం వెళ్లడం జరిగింది. అయితే ఆరోజు సౌందర్య మరణ వార్తను విన్న వెంటనే చాలా షాక్ అయ్యాను అని నటి మీనా చెప్పుకొచ్చారు. అసలు సౌందర్య చనిపోయిన తరువాత నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అని.. సౌందర్యతో నాకు చాలా అనుబంధం ఉందని నటి మీనా ఆ షోలో భాగంగా చాలా ఎమోషనల్ అయ్యారు.
Read also : అద్భుతంగా తిరుపతి బస్ స్టేషన్ ను నిర్మించాలి : సీఎం చంద్రబాబు