తెలంగాణసినిమా

తప్పు అయ్యింది… నన్ను క్షమించండి : CV ఆనంద్

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ హోంశాఖ స్పెషల్ సిఎస్ సివి ఆనంద్ తాజాగా బాలకృష్ణకు క్షమాపణలు చెప్పారు. గతంలో అనగా రెండు నెలల క్రితం పైరిసి మరియు బెట్టింగ్ యాప్ ల విషయంపై టాలీవుడ్ ప్రముఖులతో సి వి ఆనంద్ కీలక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో జరిగిన విషయాలన్నిటిని కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసుకున్నారు. అయితే ఇదే సమయంలో చాలామంది కూడా సీవీ ఆనంద్ ను ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే… సినిమా ప్రముఖులతో సమావేశం నిర్వహించినప్పుడు మరి ఈ సమావేశంలో బాలకృష్ణ ఎందుకు రాలేకపోయారు అని ఒక వ్యక్తి ప్రశ్నించగా.. దీనికి సమాధానంగా ఆనంద్ సోషల్ మీడియా ఖాతా నుంచి నవ్వుతున్న ఏమోజి సింబల్ ను రిప్లై గా పెట్టారు. అయితే ఈ ఎమోజి ని చూసి బాలకృష్ణ ఫ్యాన్స్ అలాగే చాలామంది కూడా సివి ఆనంద్ పై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భంగా ఈ విషయంపై బాలకృష్ణకు సారీ చెబుతూ అది నా ఎక్స్ ఖాతాను హ్యాండిల్ చేసే వ్యక్తి పెట్టారు అని.. అది తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీకు క్షమాపణలు అని వెంటనే ఆ ఎమోజిని తొలగించి బాలకృష్ణ కు సారీ చెప్పారు. దీంతో ఇప్పటివరకు సి వి ఆనంద్ పై ఆగ్రహిస్తున్న బాలకృష్ణ అభిమానులు ఇప్పుడు కాస్త శాంతించారు. దీంతో ఈ వివాదం ఇంతటితో ముగిసిపోయింది.

Read also : ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు.. జగిత్యాల డిపో వద్ద అద్దె బస్సు డ్రైవర్ల నిరసన!

Read also : రవితేజ – సమంత కాంబినేషన్ లో సినిమా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button