
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- నందమూరి బాలకృష్ణ ను తమ అభిమానులు ఎక్కడికి వెళ్లినా సరే “జై బాలయ్య” అని అనందే సైలెంట్ గా ఉండరు. ఈ నేపథ్యంలోనే అసలు మొట్టమొదటిసారిగా మీరు ఈ జై బాలయ్య అనే పదం ఎక్కడ విన్నారు అని తాజాగా ఒక యాంకర్ ప్రశ్నించగా దానికి సమాధానంగా బాలకృష్ణ చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ చిన్న అఖండ 2 రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సందర్భంలో.. నిన్న నార్త్ లో ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కూడా ఎక్కడ చూసినా జై బాలయ్య అనే పదమే వినిపిస్తుండడంతో.. బాగా ఆలోచించిన యాంకర్ అసలు ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా మీరు ఎప్పుడు విన్నారు అని ప్రశ్నించారు. ఇక దీనికి బాలకృష్ణ బదిలీస్తూ తల్లి కడుపులో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలనేది విన్నాడో అలాగే నేను కూడా మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే జై బాలయ్య అనే పదాన్ని విన్నాను అని బాలకృష్ణ సమాధానం ఇవ్వడంతో యాంకర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. ఏది ఏమైనా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలకృష్ణ ఎక్కడ కనిపించినా కూడా వెంటనే ప్రతి ఒక్కరి నోటి నుంచి జై బాలయ్య అనే పదాన్ని మాత్రం ఉచ్చరించాల్సిందే.
Read also : CCTV Hack: గర్ల్ ఫ్రెండ్ కోసం సీసీటీవీని హ్యాక్.. కుర్రాడు చేసిన పనికి అందరూ షాక్!
Read also : చలాన్లపై 100% డిస్కౌంట్.. ఫేక్ అని తేల్చిన హైదరాబాద్ పోలీసులు?





