
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద దుమారం రేగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంలో తన తప్పేం లేదని సృష్టి ఫెర్టిలిటీ యజమాని అయినటువంటి డాక్టర్ నమ్రత తెలియజేశారు. ఒక ఆర్మీ అధికారి తప్పుడు ఆరోపణలు వల్లే తనపై కేసు పెట్టారని డాక్టర్ నమ్రత ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి అన్ని విషయాలు కూడా త్వరలోనే బయట పెడతానని తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న నమ్రతకు సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది. తాజాగా నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భంగా మీడియాతో డాక్టర్ నమ్రత ఈ వ్యాఖ్యలు చేశారు.
Read also : ఇన్ స్టా పరిచయం.. బర్త్ డే పార్టీకి పిలిచి..
కాగా సృష్టి ఫెర్టిలిటీ కేసులో సంచలన విషయాలు ఈ మధ్య బయటపడ్డాయి. ఈ కేసు వ్యవహారంలో ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అస్సాం మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఏజెంట్లను కూడా నియమించుకున్నట్లుగా పోలీసులు గుర్తించి మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. పేద గర్భిణీలకు డబ్బులను ఆశ చూపించి.. వాళ్ల పిల్లల్ని 50 వేలు లేదా అంతకంటే ఎక్కువ రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడికి తరలిస్తారు. అంతేకాకుండా సంతానం కోసం ఫెర్టిలిటీ సెంటర్కు వచ్చే వారిని సరోగసి బిడ్డ పేరిట వారి దగ్గర లక్షల రూపాయలను విక్రయిస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా ఈ దందా కొనసాగుతుందని తెలిసింది. దీంతో ఈ వ్యవహారంలో ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో అనేది కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
Read also : ఇన్ స్టా పరిచయం.. బర్త్ డే పార్టీకి పిలిచి..