
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:-మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన రాజకీయ జీవితం గురించి హాట్ కామెంట్స్ చేశారు. తనకు రాజకీయాలు వదిలి బయటకు రావాలని అస్సలు లేదని.. కానీ బలవంతంగా ఉపరాష్ట్రపతిని చేశారన్నారు. ఆరోజు చాలా బాధనిపించిందని.. ఏడ్చేశానని కూడా చెప్పారాయన. అంతేకాదు.. అప్పటి నుంచి బీజేపీ ఆఫీసులో అడుగు పెట్టలేదన్నారు వెంకయ్యనాయుడు. ఇంతకీ అసలేం జరిగింది.
వెంకయ్యనాయుడు.. బీజేపీ సీనియర్ నేత. మోడీకి ముందున్న కమలం పార్టీలో రాజకీయాల్లో కీలక నేత. మోడీ టీమ్ బీజేపీలో కీ రోల్‌లోకి వచ్చాక.. ఆనాటి సీనియర్లను పక్కపెట్టారన్నది జగమెరిగిన సత్యం. వాళ్లలో వెంకయ్యనాయుడు ఒకరనే చెప్పాలి. వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక… ఆయనకు ఇష్టంలేకుండా జరిగిందని ప్రచారం జరిగింది. బీజేపీ పెద్దలు ఆయన్ను రాజకీయాల నుంచి తప్పించేందుకు.. వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. తన ఉపరాష్ట్రపతి పదవి గురించి ఇప్పుడు వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలతో.. ఆ విమర్శలు నిజమనే అనిపిస్తున్నాయి. ఆయన్ను బలవంతంగానే.. రాజకీయాల నుంచి పక్కన పెట్టారని వాస్తవమని తెలుస్తోంది. అంతా వెంకయ్యనాయుడు ఏం మాట్లాడారు..? అప్పటి విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారు.
Read also: ఆలయాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనుమతించొద్దు!.. దేవాదాయ శాఖ కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో రెండుసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారాయన. ఆ రెండు సందర్భాలు ఏంటో కూడా చెప్పారు. ఒకటి.. తన అమ్మ గుర్తొచ్చినప్పుడు కన్నీళ్లు వస్తాయన్నారు. రెండోది… పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలిచి తనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడు తీవ్ర ఆవేదన కలిగిందన్నారు. ఆ సమయంలో తాను బోరున ఏడ్చేశానని చెప్పారు వెంకయ్యనాయుడు. ఎందుకంటే… తనకు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏ మాత్రం ఇష్టంలేదన్నారు. మరీ ముఖ్యంగా బీజేపీతో తనకు సంబంధం లేకుండా చేయడం… తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన అని అన్నారాయన. అందుకే భావోద్వేగాన్ని ఆపుకోలేక.. ఏడ్చేశానని చెప్పారు. అయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి.. తప్పక ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చుకున్నట్టు తెలిపారు.
Read also : నేటి ముఖ్యాంశాలు.. మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ లో చదివేయండి!
ఉపరాష్ట్రపతి పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు… ఒక్కసారి కూడా బీజేపీ ఆఫీసులో కాలు పెట్టలేదని స్పష్టం చేశారు వెంకయ్యనాయుడు. ఉపరాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయినా కూడా.. ఇప్పటి వరకు పార్టీ కార్యాలయం గడప తొక్కలేదని చెప్పారు. అంతే.. ఆనాటి నాయకుల రాజకీయాలే వేరు. అందులోనూ అప్పటి కమలం పార్టీ నాయకులు అయితే.. చెప్పనక్కర్లేదు. వారి మాట… ఆరోపణ… విమర్శ అన్నీ పద్ధతిగా ఉండేది. అలాంటి విలువైన రాజకీయాలు… ఇక చూడలేమేమో.
Read also : అమెరికాపైనా 50 శాతం టారిఫ్ విధించాలి, ప్రభుత్వానికి శశిథరూర్ సూచన!