తెలంగాణవైరల్

ఐ బొమ్మ రవిది ప్రేమ పెళ్లి.. విచారణలో బయటకు వస్తున్న కీలక విషయాలు!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఐ బొమ్మ నిర్వాహకుడు రవి వ్యక్తిగత జీవితం గురించి పోలీసులు విచారణ చేస్తున్న సందర్భంలో చాలానే విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ibomma రవి వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా వీటి పై చర్చిస్తూ ఉన్నారు. ఐ బొమ్మ రవి తను కోచింగ్ తీసుకుంటున్న సమయంలో అమీర్ పేట్ కోచింగ్ సెంటర్ లో పరిచయమైనటువంటి ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు అని.. చివరికి ఆ అమ్మాయినే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని పోలీసులు తెలిపారు. కొంతకాలానికి తనకు పాప జన్మించడం… అన్ని కూడా బాగా జరుగుతున్న సందర్భంలో రవి భార్య వాళ్ళ అక్క మరియు బావ విదేశాల్లో కోట్లు సంపాదిస్తున్నారు అని ప్రతిరోజు కూడా రవిని ఒత్తిడికి గురి చేసేది. మా వాళ్లు చూడు ఎలా సంపాదిస్తున్నారో.. నీకు డబ్బు సంపాదించడం చేతకావట్లేదని.. ఇలా అయితే కలిసి ఉండడం కష్టమే అని ప్రతి రోజు కూడా రవి భార్య అలాగే రవి వాళ్ళ అత్త ఇద్దరు కూడా ప్రతిరోజు ఎగతాళి చేస్తూ ఉండేవారు అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక చివరికి విసిగిపోయిన ఐ బొమ్మ రవి 2021లో తన భార్యతో విడాకులు తీసుకోగా తనకు జన్మించినటువంటి పాపను రవి భార్యనే తీసుకువెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. ఇక ఆ తర్వాతనే ఈ ఐ బొమ్మ అలాగే బప్పం వెబ్సైట్లను మొదలుపెట్టి తన తెలివితేటలతో ఎన్నో సినిమాలను పైరసీకి గురి చేశారు. ఐ బొమ్మ పై ఎంతోమంది సినిమా ప్రముఖులు అందరూ కూడా కంప్లైంట్ చేయగా ఇన్నాళ్లకు రవిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇక సుప్రీంకోర్టు ఇతనికి ఎటువంటి శిక్ష వేస్తుందా అని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read also : ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.. చివరికి చనిపోయాడు అంటూ ఏడ్చేసిన గ్రామస్తులు!

Read also : బాబు లేటెస్ట్ లుక్స్… అదిరిపోయాడు అంతే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button