తెలంగాణరాజకీయం

రెండోసారి కూడా నేనే సీఎం - రేవంత్‌రెడ్డిది కాన్ఫిడెన్సా..? ఓవర్‌ కాన్ఫిడెన్సా..?

Telangana : రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా.. వదులుకోవాలని ఎవరికీ ఉండదు. కుర్చీ కాపాడుకోవాలనే చూస్తారు. అందుకు ఎన్నో వ్యూహాలు.. పొలిటికల్‌ స్ట్రాటజీలు ఉండాలి. వెన్నుపోటుదారులను గమనించుకోవాలని… కుయుక్తులను పసిగట్టగలగాలి. కాంగ్రెస్‌ పార్టీలో అయితే… మరీ కష్టం. ఆ పార్టీలో సీనియర్లు ఎక్కువ కనుక కుమ్ములాటలు ఎక్కువ… కుర్చీ కోసం కుస్తీలు పట్టేస్తారు. తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుత పరిస్థితి కూడా అదే. అధికారంలోకి రాగానే.. సీఎం పదవి కోసం.. చాలా మంది లాబీయింగ్‌ చేశారు. కానీ… ఎంతో మంది సీనియర్లను దాటుకుని… ఆ అవకాశం రేవంత్‌రెడ్డికి వచ్చింది. కానీ.. ఆ పదవి ఎంతో కాలం ఉండదన్న చర్చ జరుగుతోంది.

రేవంత్‌రెడ్డి వ్యతిరేకవర్గం.. ఎప్పటి నుంచో ఆయనపై కారాలు మిరియాలు నూరుతూనే ఉంది. అధిష్టానానికి నెగటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తూనే ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతపై కూడా కొందరు సీనియర్లు… హైకమాండ్‌కు ఫిర్యాదులు చేస్తున్నారట. దీంతో… రేవంత్‌రెడ్డి ఎంతో కాలం ముఖ్యమంత్రిగా కొనసాగలేరని… కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో.. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాయి. కాంగ్రెస్‌ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుందని… రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అని తేల్చి చెప్పారాయన. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో.. తెలంగాణలో సీఎం మార్పు పుకార్లకు బ్రేక్‌ పడినట్టు అయ్యింది.

Read More : కేసీఆర్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన రేవంత్‌రెడ్డి – జగన్‌కు కూడా వర్తిస్తుందా..?

అయితే… రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆ స్టేట్‌మెంట్‌పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం పదవి మార్పుపై వస్తున్న పుకార్లను కట్టడిచేసేందుకే రేవంత్‌రెడ్డి అలా చెప్పారా…? లేదా.. అధిష్టానం నుంచి ఆయనకు క్లియర్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఉన్నాయా…? అధిష్టానం నుంచి హామీ తీసుకుని.. రెండోసారి గెలిస్తే తాను సీఎం అని కాన్ఫిడెంట్‌గా చెప్పారా..? లేదా… అది రేవంత్‌రెడ్డిలోని ఓవర్‌ కాన్ఫిడెన్సా…? ఏది ఏమైనా… సీఎంగా రేవంత్‌రెడ్డిని ఒప్పుకోలేకపోతున్న కొందరు సీనియర్లకు… ఈ మాటలు గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా మారాయి. అయితే… కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. పార్టీ హైకమాండ్‌… రెండోసారి కూడా రేవంత్‌రెడ్డినే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుందని అనుకోలేం. కనుక… రేవంత్‌రెడ్డిది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అని కొట్టిపడేస్తున్నారు కొందరు. మరి కొందరైతే… రెండోసారి కాంగ్రెస్‌ గెలవనీ చూద్దాం అనే రీతిలో మాట్లాడుతున్నారు.

ఇవి కూడా చదవండి …

  1. టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?

  2. ఇద్దరు హీరోల మధ్య గొడవ!…. రాజకీయంలో ఏదైనా జరగొచ్చు అంటే ఇదేనేమో?

  3. జనసేన జాతీయ పార్టీ కాబోతోందా – ఆవిర్భావ సభలో పవన్‌ వ్యాఖ్యల అర్థం అదేనా!

  4. సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యమ జర్నలిస్టుల వార్నింగ్

  5. తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ రచ్చే.. మూడు కీలక బిల్లులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button