తెలంగాణ

మణికొండకు బుల్డోజర్లు.. రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్

హైదరాబాద్ లో మళ్లీ బుల్డోజర్లు రోడ్డెక్కుతున్నాయి. కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న హైడ్రా మళ్లీ యాక్షన్ లోకి దిగింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ, అల్కాపురి టౌన్‌షిప్‌లో అనుహర్‌ హోమ్స్‌ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన మార్నింగ్‌ రాగా గేటెడ్‌ కమ్యూనిటీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. మార్నింగ్ రాగ గేటెడ్ కమ్యూనిటీలో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్‌గా వినియోగించడంపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌తో పాటు నివాసితులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకున్న ప్రకారమే నిర్మాణాన్ని ఉంచాలని, ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరగకుండా చూడాలని అధికారులకు కమీషనర్ ఆదేశించారు. అనుమతుల మేరకే భవన వినియోగం ఉండాలని నిర్వహణదారులకు హైడ్రా అధికారులు సూచించారు.

మంచిరేవుల దగ్గర మూసీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. మూసీ నది పరివాహకంలో మట్టి పోసిన నిర్మాణ సంస్థలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీలో వేసిన మట్టిని వెంటనే తొలగించాలని ఆదిత్య, NCC, రాజ పుష్ప నిర్మాణ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. మట్టిని పూర్తిగా తొలగిస్తామని నిర్మాణ సంస్థలు హామీ ఇచ్చాయి.

మరిన్ని వార్తలు చదవండి…

‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’.. ప్రకటించిన కేంద్రం!

ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్

శివరాజ్ కుమార్ కు క్యాన్సర్!…తన ఆస్తి అంత ఏం చేస్తున్నాడో తెలుసా..?

వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..

భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!

కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్ 

జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్

అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?

కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button