నాగర్‌కర్నూల్ జిల్లా లత్తీపూర్ సమీపంలో రాకపోకలకు అంతరాయం
నాగర్‌కర్నూల్ (క్రైమ్ మిర్రర్): నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని లత్తీపూర్ గ్రామం సమీపంలో హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారి భారీ వర్షాల ప్రభావంతో కొట్టుకుపోయింది. దాంతో రహదారిపై వాహన రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.
గత మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న అతివృష్టి కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగిపోతున్నాయి. వాటి ప్రభావంతో లత్తీపూర్ వద్ద రహదారి పక్కనున్న కండకట్ట కొట్టుకుపోవడంతో హైవేలో గట్టిగా గండం ఏర్పడింది. పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే వాహనదారులను హెచ్చరించి రహదారిపై ప్రయాణం నిలిపివేశారు.
Also Read:సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సూపర్ స్టార్ మేనకోడలు?
స్థలాన్ని చేరుకున్న రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (ఆర్అండ్‌బీ) విభాగం అధికారులు నష్టాన్ని పరిశీలించి తాత్కాలికంగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు ఆగిన తర్వాతే రహదారి మరమ్మత్తు పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న వాహనదారులు అలంపూర్ కర్నూల్ మార్గం లేదా అమ్రాబాద్ బైపాస్ ద్వారా వెళ్లాలని సూచించారు.
Also Read:విజయ్ కి ఎదురు దెబ్బ.. నష్టపరిహారపు 20 లక్షలు మాకొద్దు అంటున్న బాధితురాలు





