
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ల పై 100 శాతం వరకు తగ్గింపు అంటూ సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 13వ తేదీన ట్రాఫిక్ చలానాలపై 100% వరకు కూడా డిస్కౌంట్ అని జరుగుతున్న ప్రచారం తాజాగా పోలీసుల దృష్టికి చేరింది. దీంతో వెంటనే పోలీసులు సోషల్ మీడియా ఖాతాల ద్వారా డిసెంబర్ 13వ తేదీన ట్రాఫిక్ చలాన్ల పై డిస్కౌంట్ అనేది తప్పుడు ప్రచారం అని.. పోలీస్ అధికారులు ఎవరూ కూడా అలాంటి నిర్ణయం తీసుకోలేదు అని హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి ప్రకటనలు ఇప్పటివరకు మేము విడుదల చేయలేదు.. ప్రభుత్వ అధికారుల అఫీషియల్ ఖాతాలను మాత్రమే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలని సూచించారు. అనధికారికంగా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఎంతో సమాచారం వైరల్ అవుతుంది అని.. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని కోరారు. ప్రతిరోజు కూడా పోలీస్ హ్యాండిల్స్ ను చెక్ చేస్తూ మీ తదుపరి విషయాల్లో ముందుకు వెళ్లాలి అని తెలిపారు. అయితే గత కొద్ది రోజుల నుంచి డిసెంబర్ 13వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తుండడంతో.. అదే రోజున ఈ ట్రాఫిక్ చలానాలపై 100% వరకు తగ్గింపు అని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ప్రచారం చేస్తున్న వ్యక్తులను కచ్చితంగా పట్టుకొని తీరుతామని పోలీసులు తెలిపారు.
Read also : Flights Cancelled: 1200 విమాన సర్వీసుల రద్దు, ప్రయాణీకుల ఆగ్రహం!
Read also : Putin India Tour: ఇవాళ భారత్ కు పుతిన్.. రెండు రోజుల పాటు పర్యటన!





