
గండిపేట్,క్రైమ్ మిర్రర్:- రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని శ్రీరాంనగర్ ఓల్డ్ కర్నూల్ రోడ్డులోని బస్తీలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ వద్దు, సైబరాబాద్ ముద్దు అనే నినాదంతో భారీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గండిపేట్ డివిజన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ నాయకత్వం వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి శ్రీరాంనగర్ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. హైదరాబాద్‌ను విభజించి సైబరాబాద్ పరిధిలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, వారి భావోద్వేగాలను ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అంశంపై బస్తీల్లో ప్రజలు ధర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో, జీహెచ్ఎంసీ కమిషనర్ మూడు కమిషనరేట్లు ఏర్పాటు చేయడం తథ్యమని చేసిన ప్రకటన మరింత ఆందోళనకు దారితీస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పక్కనపెట్టి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.
Read also : Parag Tyagi: నా భార్యను చేతబడి చేసి చంపేశారు
ఈ సందర్భంగా ఎస్.వెంకటేష్ మాట్లాడుతూ, ప్రజావ్యతిరేక నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున కార్యక్రమాలు, నిరసనలు చేపడతామని, అవసరమైతే జీహెచ్ఎంసీ కార్యాలయం ముట్టడికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.ఈ కార్యక్రమంలో నోముల రాము యాదవ్, యువజన అధ్యక్షుడు అక్కెం రఘు యాదవ్, కొంపల్లి జగదీష్ నేత, ఎడ్ల కాడి సూర్యం, దుర్గేష్, వెంకటరమణ, సలీం బాయ్, ఇర్లపల్లి ప్రవీణ్, గంజి రాజు నేత, అశోక్, చికెన్ రాజు, వేణు, బాల్ రాజ్ యాదవ్, సాయి, లక్ష్మీ రాజ్, అరుణ రెడ్డి, ఏర్వసరిత మహేష్ నేత, సుగుణ, సంతోష్, మల్లేష్ నేత, సూరి, అనిల్, సింహాచలం, నాని, రమేష్, ఉప్పల్ శ్రీను, పోతరాజు రమేష్, ప్రవీణ్ సన్నీ, రాజు, శివ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల మద్దతుతో ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని, హైదరాబాద్ గుర్తింపును కాపాడేందుకు బీఆర్ఎస్ చివరి వరకు పోరాటం చేస్తుందని నేతలు స్పష్టం చేశారు.
Read also : Shocking: గర్ల్‌ఫ్రెండ్‌ను చంపి 7 రోజులు శవంతో దారుణానికి పాల్పడ్డ యువకుడు (VIDEO)





