క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఎస్సై సంజయ్ సావంత్(60) గుండెపోటుతో మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యారక్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
నైట్ డ్యూటీలో పోలీస్ స్టేషన్ బ్యారక్‌లో ఉన్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సహోద్యోగులు సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇటీవలి కాలంలో తెలంగాణలో పోలీసు అధికారులు మరణించిన సంఘటనలు తరాసు వింటున్నాము, నవంబర్ 2025లో, ఆర్థిక సమస్యల కారణంగా వరంగల్‌కు చెందిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై ఆసిఫ్ ఆత్మహత్య చేసుకున్నారు.
అక్టోబర్ 2025లో, నిజామాబాద్‌లో ఓ దొంగను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్‌ను నిందితుడు కత్తితో పొడిచి చంపాడు. గతంలో (2024 డిసెంబర్ లో) కూడా ములుగు జిల్లాలో ఒక ఎస్సై సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు తెలిసినవే





