హైదరాబాద్ పరిధిలో ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా పాతబస్తీలోని ఓ ఆలయంలో మాంసం ముద్దలు పడేయడం తీవ్ర దుమారం రేపుతోంది. తప్పచబుత్ర జిర్ర హనుమాన్ ఆలయంలో శివ లింగం వెనుక మాంసం పడేసిన దుండగులు. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు శివాలయంపై మాంసం ముద్దలు చూసి షాకయ్యారు.
శివాలయంలో మాంసం చూసి కంగుతిన్నారు భక్తులు. పోలీసులకు సమాచారం ఇచ్చారు భక్తులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు తీసుకుంటున్నారు. హిందూ సంఘాలు ఆలయానికి భారీగా చేరుకుంటున్నాయి.
మాంసం పడ్డేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శివాలయంలో మాంసం ముద్దలు పడేసిన ఘటనతో పాతబస్తీలో తీవ్ర ఆందోళన నెలకొంది.