
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణలో ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. వినాయక చవితి పండుగ ఒక ఎత్తు అయితే.. చివరి రోజు వేలంపాట, నిమర్జనం అనేవి మరో ఎత్తు. చిన్నపిల్లల నుండి పెద్దపెద్ద వారి వరకు కూడా గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతూ ఆనందంగా గడుపుతారు. ఇక తాజాగా హైదరాబాదులోని 10 కేజీల గణపతి లడ్డు వేలంపాటలో చరిత్ర సృష్టించింది. రాజేంద్రనగర్ సన్ సిటీ లోని రిచ్ మండ్ విల్లా లో గణపతి లడ్డు వేలం పాటలో ఏకంగా 2.32 కోట్లు పలికి రికార్డ్ సృష్టించింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ గణించేటువంటి వేలంపాటకు చాలా మంది స్థానికులు అలాగే గణేష్ భక్తులు భారీగా తరలి వస్తుంటారు. కేవలం ఇక్కడ వేలంపాట చూడడానికే ఇతర ప్రాంతాలనుంచి కూడా చాలామంది ప్రజలు హాజరవుతుంటారు. ఈ ఏడాది ఈ రిచ్ మండ్ విల్లాలో కోటి రూపాయల నుంచి వేలం పాట మొదలు పెట్టినట్లుగా సమాచారం అందింది. కాగా గతి ఏడాది ఇక్కడ గణపతి లడ్డు వేలంపాటలో 1.87 కోట్లు పలికింది.
Read also : శిథిలాల కింద మహిళలు, పట్టించుకోని రెస్క్యూ సిబ్బంది!
అయితే ప్రతి ఏడాది కూడా 80 విల్లాల ఓనర్స్ నాలుగు గ్రూపులుగా ఏర్పడి బిడ్ తరహాలో వేలంపాటలో పాల్గొనడం జరుగుతుంది. ఈ యాక్షన్ లో వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా ఆర్.వి దియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. వృద్ధాశ్రమాలు మొదలుకుని స్త్రీ సంక్షేమం, జంతు సంరక్షణకు ఈ డబ్బులు వినియోగిస్తారు. కాగా ఇక్కడ 2018లో కేవలం 25 వేల రూపాయలతో మొదలైన ఈ లడ్డువేలం పాట అనేది… 2025 కు వచ్చేసరికి 2.32 కోట్లకు చేరింది. భవిష్యత్తులో ఈ వేలం పాట మరింత పెరుగునుంది అని స్పష్టంగా అర్థమవుతుంది.
Read also : భారత్, రష్యాను కోల్పోయాం.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!