క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: హైదరాబాద్‌లోని బోరబండలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త దారుణంగా హత్యా చేశాడు.అనుమానమే పెనుభూతమై ఒక నిన్నడు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, భార్యను హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని బోరబండలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని బోరబండలో సైట్-3 ప్రాంతంలో రమేష్, జ్యోతి దంపతులు కొంతకాలంగా నివాసం వుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపద్యంలో కొన్నిరోజులుగా భార్య ప్రవర్తన పై అనుమానం పెంచుకున్నడు భర్త. గత కొన్ని రోజులగా వారి ఇద్దరు పలుమార్లు గొడవపడినట్లు సమాచారం.
భార్య ప్రవర్తన పై అనుమానం పెంచుకున్న భర్త, తన భార్య జ్యోతిపై అనుమానంతో గొంతు నులిమి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు రమేష్ అక్కడి నుండి పరారయ్యాడు అన్నట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





