క్రైమ్

బెంగళూరులో దారుణం… భార్యను చంపి సూట్ కేసులో కుక్కి పారిపోయిన భర్త!

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- బెంగళూరులో ఘోర విషాదం నెలకొంది. సొంత భార్యని చంపి సూట్ కేసులో కుక్కి పరారైన భర్త. ఇక అసలు విషయానికి వస్తే… మహారాష్ట్ర కు చెందిన రాకేష్ అనే వ్యక్తి తన భార్యతో బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు గానీ కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేసి సూట్ కేస్ లో కుక్కి పరారయ్యాడు. వెంటనే తన భార్య తల్లిదండ్రులకు మీ అమ్మాయిని చంపేశానని ఫోన్ చేసి సమాచారం అందించాడు భర్త . వెంటనే అక్కడికి చేరుకున్న అమ్మాయి తల్లిదండ్రులు సూట్ కేస్ ఓపెన్ చేయగా తన కూతురు శవం బయటపడింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా పూణేలో దొరికాడు.

తరచూ నాతో గొడవ పడుతుందన్న కారణంతోనే ఘోరంగా చంపేశానని, నాపై తరచూ ఏ కారణం లేకుండానే చేయి చేసుకుంటుందని… కోపంతోనే ఇలా చంపేశాను అంటూ భర్త చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తన భర్త చంపేశారని నిజం ఒప్పుకోవడంతో పోలీసులు వెంటనే అతడినీ అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. అయితే ఈమధ్య బెంగళూరులో ప్రతిరోజు కూడా ఎన్నో ఘోర విషాదాలు జరుగుతున్నాయి.

ఇండియన్ రిచెస్ట్ పర్సన్స్ ఎవరో మీకు తెలుసా?

భట్టి విక్రమార్కకు ప్రమోషన్‌ – డ్రాఫ్టింగ్‌ కమిటీలో చోటు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button