
Illegal affair : ఈ మధ్యకాలంలో కొందరు అక్రమ సంబంధాల రోజులో పడి చేజేతులారా కాపురాలని నాశనం చేసుకోవడంతోపాటు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. రీసెంట్ గా పెళ్ళై, ఒక కూతురు ఉన్న వివాహిత ప్రియుడి మోజులో పడి చివరికి అతని చేతిలోనే దారుణ హత్యకు గురైన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని మైసూర్ పట్టణ పరిసర ప్రాంతంలో దర్శిత అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో నివాసముంటుంది. అయితే దర్శిత పెళ్లికి ముందు సిద్ధ రాజు అనే యువకుడితో ప్రేమలో పడింది. కానీ సిద్ధ రాజు మాత్రం దర్శిత ని కేవలం శారీరకంగా అలాగే ఆర్థికంగా వాడుకుంటూ వచ్చాడు. దర్శిత పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడిన సిద్ధరాజు మాత్రం ప్రస్తుతం తన పరిస్థితి బాలేదని, సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని కల్లిబుల్లి మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. కానీ ఇంతలోనే దర్శిత తల్లిదండ్రులు దుబాయ్ లో ఉద్యోగం చేసేటువంటి సుభాష్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయించి పెళ్లి చేశారు.
సుభాష్ ఉద్యోగ రీత్యా కేవలం ఏడాదికి ఒకసారి ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. దీంతో దర్శిత, సిద్ధ రాజు బంధానికి ఎలాంటి అడ్డు లేకపోవడంతో ప్రేమ బంధాన్ని అలాగే కొనసాగించారు. దీంతో ఇంట్లోవాళ్లు లేనప్పుడు కలుసుకోవడం వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ వంటివి చేసుకోవడం వంటివి చేసేవాళ్లు. కానీ ఈ మధ్య దర్శిత సిద్ధ రాజు ని పెళ్లి చేసుకోమని బలవంత పెడుతూ వచ్చింది. దర్శితను వదిలించుకునేందుకు సిద్ధరాజు వేగంగా ఆమెని చంపాలని ప్లాన్ చేశాడు. మైసూరు పట్టణప్ప పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి హోటల్ కి తీసుకెళ్లి డిటోనేటర్ పెట్టి హతమార్చాడు. తర్వాత ఫోన్ చార్జర్ పేలి దర్శిత చనిపోయిందంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ సిద్దరాజు రిలేషన్షిప్ గురించి తెలిసిన కొందరు దర్శిత బంధువులు పోలీసులకి తెలియజేశారు. దీంతో సిద్ధ రాజుని అదుపులోకి తీసుకొని విచారించగా నిజం బయటపడింది. అలాగే దర్శిత తనని పెళ్లి చేసుకోమని పోరు పెడుతుందని అందుకే ఆమె అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు.