తెలంగాణ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్… 55,418 పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా మరోసారి ఖాళీలన్నింటినీ భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 58,868 పోస్టులను భర్తీ చేసింది. అయితే మరోసారి 55,418 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.

ఖాళీల వివరాలు ఇలా :

రెవెన్యూ శాఖ :

రెవెన్యూ శాఖలో గ్రామ పరిపాలన అధికారులు ( GPO )10,954 పోస్టులు భర్తీ చేయనున్నారు. వాటిలో 6,000 మంది ప్రస్తుత వీఆర్వో ల నుంచి నియామకం చేస్తుండగా, మిగతా 4,954 కొత్త పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ :

ఈ శాఖలో 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,837 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీ చేయనున్నారు

విద్యాశాఖ :
విద్యాశాఖ కు సంబంధించి గురుకులాల్లో ఖాళీగా ఉన్న 30,228 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించనున్నారు.

ఇతర శాఖలు :
గ్రూప్ 1,2,3,4, ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచర్ రిక్రూట్మెంట్ ( DSC ), ఇతర శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయనున్నారు. అయితే నోటిఫికేషన్లు, రిక్రూట్మెంట్ కు సంబంధించి ఇంకా ఖచ్చితమైన అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో రానున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఖాళీల భర్తీ నోటిఫికేషన్ల కు సన్నద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button