Monday, February 23, 2026
Homeతెలంగాణబిర్యానీ సెంటర్‌ లో భారీ పేలుడు.. చెల్లా చెదురుగా బయటపడ్డ వస్తువులు!

బిర్యానీ సెంటర్‌ లో భారీ పేలుడు.. చెల్లా చెదురుగా బయటపడ్డ వస్తువులు!

క్రైమ్ మిర్రర్, నల్లగొండ :- నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ బిర్యాని సెంటర్‌ లో పేలుడు కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ రోడ్డులోని పూజిత అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న హాట్ బకెట్ బిర్యాని సెంటర్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి షెటర్ గేటు తో సహా లోపల ఉన్న సామాన్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచే సుకోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. అయితే గ్యాస్ సిలిండర్ పేలిందా లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. రంజాన్ మాసం సందర్భంగా అర్ధరాత్రి వరకు షాప్ తెరిచే ఉందని, షాప్ మూసివేసిన 15 నిమిషాల కే పేలుడు సంభవించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనలో గ్యాస్ సిలిండర్ అయితే ఏమీ పేలలేదని, మరేదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి …

  1. కాంగ్రెస్ విధేయుడిని కోల్పోయాం :- కె ఎల్ ఆర్

  2. బిగ్ బ్రేకింగ్… ” పది పేపర్ ” లీకేజీ నిందితుల అరెస్ట్..

  3. కదలుతున్న రైలులో అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్

  4. బెట్టింగ్ సమయం… యువకుల ఫోన్లను తనిఖీ చేస్తున్న పోలీసులు? 

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments