
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సంఖ్య తగ్గిందని చాలానే వార్తలు వచ్చాయి. కానీ తిరుమల తిరుపతి క్షేత్రానికి భక్తులు రాకును ఎవరు ఆపగలరు?.. అన్నట్టుగా నేడు తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా కూడా భక్తులు కనిపిస్తుండడంతో తిరుపతి క్షేత్రం ‘భక్త జనసంద్రం’ ల కనిపిస్తుంది. నేడు శ్రీవారి గరుడ వాహన సేవ జరుగుతున్న కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల తిరుపతి దేవస్థాన కొండపైకి చేరుకున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక ఆక్టోపస్ భవనం నుంచి క్యూ కూడా కొనసాగుతూ ఉంది. ఇవాళ భక్తులు పెద్ద సంఖ్యలో ఎందుకు వచ్చారంటే రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి నేడు గరుడ వాహన సేవ జరుగుతుంది. ఇక రెండవది శనివారం, ఆదివారం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు చూడడానికి వస్తున్నారు.
Read also : CM తో బతుకమ్మ ఆడిన రామ్ చరణ్ సతీమణి!
కేవలం శనివారం నాడు మాత్రమే 75,000 మంది స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. అందులో ఏకంగా 45 వేల మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక దీంతో పాటు హుండీ ఆదాయం 3 కోట్ల 36 లక్షలు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం గురించే. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు. బ్రహ్మోత్సవాలలో భాగంగానే ఇప్పటికే చాలామంది భక్తులు కొండపైకి చేరుకున్నారు. దీంతో తిరుమల క్షేత్రమంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది.
Read also : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు?