జాతీయం

శబరిమలలో లక్షలాది భక్తులు.. చేతులెత్తేసిన ఆలయ అధికారులు

కేరళ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. డిసెంబర్ 21 ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరి కొండ శరణ ఘోషతో మారు మోగుతోంది. పంబ నుంచి సన్నిధానం భక్తులు బారులు తీరారు.అయ్యప్ప స్వామి దర్శనానికి 7 గంటల సమయం పడుతుంది. మకర విళక్కు సీజన్ లో మండల పూజ కోసం నవంబర్ 16న ఆలయం తెరుచుకోగా… లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు.

భక్తులు ఇబ్బంది పడకుండా ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అన్ని చర్యలు తీసుకుంది. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, జనవరి 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగుస్తుంది. రాబోయే రోజుల్లో రోజుకు లక్షకు పైగా భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.

జనవరి 26వ తేదీన సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ క్రమంలో తొలుత అయ్యప్ప స్వామిని ‘తంకా అంకి’తో అలంకరించిన తర్వాత, పవిత్రమైన బంగారు వస్త్రాన్ని ఉత్సవ ఊరేగింపుతో ఆలయానికి తీసుకొస్తారు. తర్వాత మండల పూజ నిర్వహిస్తారు. ఈ మండల పూజ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీ నుంచి అయ్యప్ప దర్శనానికి దాదాపు లక్ష మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button